KKD: జగ్గంపేట మండలం రాజపూడి, గోవిందపురం, వెంగయమ్మపురం, మల్లిసాల గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై రూ. 90 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అలాగే గోకులం షెడ్డును కూడా ప్రారంభించారు.