KMR: మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ గ్రామంలో బుధవారం ఏఈవో రేణుక వరి పంటను పరిశీలించారు. వరి పంటలో దోమపోటు ఉధృతిని గమనించారు. రైతులు దోమపోటు నివారణకు తగిన యాజమాన్య పద్ధతులు నిర్వహించి, ఎకరానికి బుఫ్రోఫెసిన్ 320 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 120 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు.