MDK: తూప్రాన్ మండలం పడాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన భూపతిరెడ్డి పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాధాకిషన్ పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు.