ఈ నడిమధ్య కొత్త కొత్త రకం నేరాలు (Crime) బయటపడుతున్నాయి. మన ఊహాకు కూడా తట్టని రీతిలో నేరాలు జరుగుతున్నాయి. కొత్త పంథాలో మోసాలు (Fraud) జరుగుతుండడంతో పోలీసులు వాటిని చూసి నివ్వెరపోతున్నారు. తాజాగా ఓ మహిళ అంధురాలినని (Blind Person) బుకాయించి ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఫించన్ పొందింది. అలా ఏకంగా 15 సంవత్సరాల పాటు నటించింది ఫించన్ తీసుకుంటోంది. కానీ మోసం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా! ఓ చిన్న పొరపాటుతో (Mistake) ఆమె నాటకం బయటపడింది. నాటకం బహిర్గతం కావడంతో ఆమె జైలు పాలైంది. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది.
ఇటలీలోని (Italy) గియోయా టౌరో (Gioia Tauro) అనే నగరానికి చెందిన 48 ఏళ్ల మహిళ అంధురాలిగా అధికారులను నమ్మించింది. అంధురాలినని వైద్యుల నుంచి ధ్రువపత్రం (Disability Certificate) పొందింది. ఆ పత్రాన్ని చూపించి ప్రభుత్వం నుంచి ఫించన్ (Pension) సదుపాయం పొందుతోంది. ఇలా 15 ఏళ్ల పాటు పింఛన్ పొందుతోంది. ఇలా 208,000 యూరోలు (దాదాపు రూ.1.8 కోట్లు) పింఛన్ రూపంలో తీసుకుంది. అయితే ఒకసారి ఆమె తన ఫోన్ ను (Smart Phone) వినియోగిస్తూ అధికారుల కంటపడింది. పత్రాలపై సంతకాలు (Sign) కూడా చేస్తోంది. ఇదంతా నిశితంగా పరిశీలించిన అధికారులు ఆమె అంధురాలు కాదని నిర్ధారణకు వచ్చారు. ఆమె నాటకాన్ని (Drama) బహిర్గత పర్చారు. అనంతరం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
కాగా ఆమెకు అంధురాలిగా గుర్తింపునిస్తూ ధ్రువపత్రం జారీ చేసిన వైద్యుడిపై (Doctor) కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఆమె తెలివిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏమాత్రం అనుమానం రాకుండా అంధురాలిగా 15 సంవత్సరాల పాటు నమ్మించడం (Act) సాధారణ విషయం కాదు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.