TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఛేంజ్..న్యూ డేట్స్
తెలంగాణ ఎంసెట్(telangana eamcet 2023) పరీక్ష తేదీ షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నీట్ యూజీ, tspsc ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో వీటిని మార్పు చేశారు.
తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పులు జరిగాయి. నీట్ యూజీ, TSPSC పరీక్షల నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల తేదీలను మార్చుతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఈ క్రమంలో నూతన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకు ముందు మే 7 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ జరగనున్నట్లు ప్రకటించారు.
మరోవైపు మే 10, 11వ తేదీల్లో జరగనున్న ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ గతంలో చెప్పిన ఈ తేదీ ప్రకారమే నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక ఏప్రిల్ 4తో తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆలస్యంగా రుసుముతో మే 2వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులు తీసుకోనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు TS EAMCET 2023 దరఖాస్తు ఫారమ్‌కు తెలంగాణ EAMCET అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in/లో ఆన్లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్య రుసుము లేకుండా TS EAMCET 2023 రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 10గా ప్రకటించారు. ఏప్రిల్ 30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.