WGL: వరంగల్ రైల్వే స్టేషన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు. ప్రయాణికుల సౌకర్యాలు, స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని సమీక్షించారు. ఏబీఎస్ఎస్లో భాగంగా రూ. 25.89 కోట్ల వ్యయంతో స్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పుడు అనుసరిస్తున్న భద్రత విధానాలను మార్గదర్శకాలను పరిశీలించారు.