SRD: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు. వెయింటింగ్‌లో ఉన్న డీఏలను కూడా విడుదల చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి పాల్గొన్నారు.