కృష్ణా: విశ్వనాథపల్లి అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా రూ. 13,96,300 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో జయ శ్రీ తెలిపారు. ఈ నెల 13,14 తేదీలలో జరిగిన జాతర మహోత్సవానికి వచ్చిన భక్తులు వేసిన కానుకలు, తలనీలాలు, కొబ్బరి చిప్పలు, లడ్డు పాటలు, వీఐపీ దర్శనాలు, పాలు పొంగళ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఈవో తెలిపారు.