కృష్ణా: బాపులపాడు మండలం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ నేడు ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. తొలివిడతలో 600 ఉద్యోగాలు, రెండో విడతలో 1,200 ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు పల్లెటూరుగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు పట్టణంగా మారబోతుందని ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.