KRNL: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఆదోని BJP ఎమ్మెల్యే డా.పార్థసారథి తన గళాన్ని వినిపించారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేదని, గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్ వంటి వివిధ జబ్బులతో మధ్యతరగతి కుటుంబం కాస్త పేద కుటుంబంగా మారిపోతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కోరారు.