MNCL: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 40 మందికి కారుణ్య నియామక పత్రాలను ఏరియా జీఎం దేవేందర్ అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకల ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.