సత్యసాయి: జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పదో తరగతి పరీక్షల మొదటి రోజున 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య తెలిపారు. మొత్తం 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది పరీక్షకు హాజరయ్యారు. పెనుకొండ డివిజన్లో 129 మంది, ధర్మవరం డివిజన్లో 81 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.