NDL: బండిఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సెంటర్కు పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయడానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హాల్ టికెట్ నంబర్లు, రూమ్ నంబర్లు నోటీసు బోర్డులో ఏర్పాటు చేయలేదని విద్యార్థుల పేరెంట్స్, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు.