మేడ్చల్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కారు డ్రైవర్ అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధి హకీంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. హకీంపేటలో నివసించే సాయిరాం(23) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 15న పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.