ప్రకాశం: కొరిశపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాల స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.