ELR: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహణకు 133 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 25,179 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ పరీక్షల నిమిత్తం 62 మంది కస్టోడియన్లను, 1,120 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.