SKLM: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. సీఐ అవతారంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.