MNCL: రామకృష్ణాపూర్ పట్టణం ఆర్కే-1 మార్కెట్లో ఉన్న 38 నెంబర్ గల రేషన్ దుకాణంలో ఉండాల్సిన నిలువల కన్నా మూడున్నర క్వింటాళ్ల బియ్యం తక్కువ ఉన్నట్లు.. జిల్లా పౌరసరఫరాధికారి బ్రహ్మారావు తనిఖీ చేసి గుర్తించారు. ఈ మేరకు సదరు డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తనిఖీల్లో ఏసీ ఎస్ఓ వేణుగోపాల్, ఆర్ఎ భూమేష్ తదితరులు ఉన్నారు.