MBNR: అడ్డాకులలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. HYD నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న WNP డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి బొలెరోవాహనం ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఆత్మకూరు మండలం పిన్నెంచెర్లకుచెందిన కుమ్మరి నాగలక్ష్మన్న(40) అక్కడికక్కడే మృతిచెందాడు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.