ASR: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి భీమశంకరరావు విద్యార్థులకు సూచించారు. ఇవాళ పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. సక్రమమైన నడవడికతో జీవితాలు తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు.