VZM: ప్రభుత్వ ఆదాయం మిగులు కోసం పెన్షన్లు కుదింపు నిర్ణయం సిగ్గు చేటని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన పీ.డబ్ల్యూ మార్కెట్ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు సరిపోవడం లేదని.. అర్హులైన పేదలకు పింఛన్లు రద్దు చేసి ఆ సొమ్ములతో మరొక పథకాన్ని అమలు చేయడమేటని ప్రశ్నించారు.