ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే కీలక బిల్లును కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళన నడుమ ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. కాసేపటికే సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో మరీ పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.