MBNR: జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం భరోసా కన్వర్జేన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సెల్ అథారిటీ అధికారి ఇందిర, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భరోసా సెంటర్లు మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు.