AKP: గొలుగొండ మండలం చీడిగుమ్మల పీఏసీఎస్ ఛైర్మన్గా భీమిరెడ్డి సత్యనారాయణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ.. పీఏసీఎస్ అభివృద్ధి బాటలో నడిపించడానికి కృషి చేస్తానని, రైతులకు అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అప్పలనాయుడు, మున్సిపల్ కౌన్సిలర్లు చింతకాయల రాజేష్, మధు పాల్గొన్నారు.