ప్రకాశం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు సంతోషంగా ఉన్నారని కనిగిరి ఏఎంసి ఛైర్మన్ యాదవ రమా అన్నారు. బుధవారం పామూరులోని స్థానిక బస్టాండ్లో మహిళలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.