ASF: జైనూర్ మండలం మర్లవాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణా రావు బుధవారం సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల ప్రకారం మెనూ సరిగా అమలవుతుందా, లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ప్రయోజకులు అవ్వాలని కోరారు.