KRNL: నగరంలోని సెట్కూరు కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కర్నూలు నగర పాలక కమిషనర్ యస్. రవీంద్ర బాబు పరిశీలించారు. గురువారం టోకెన్ల జారీ, ఆహారం వడ్డింపు, స్వచ్ఛత, తాగునీటి వసతులకు సంబంధించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అంతకన్నా ముందు జగన్నాథ గట్టుపై టిడ్కో నందు ఎస్బిఐ బ్యాంకు సహకారంతో నర్సరీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.