ATP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం రద్దు చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.