RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు.