NLR: బుచ్చి పట్టణంలోని శివసాయినగర్లో వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చిన్నారులు బయట తిరగాలంటే పాముల బెడదతో భయాందోళన చెందుతున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు సుభాని సమస్యను వైస్ చైర్మన్ నస్రిన్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి వీధిలైట్లను ఏర్పాటు చేశారు.