ASR: అంగన్వాడీ కార్యకర్తలకు ఆరు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు డుంబ్రిగుడ మండల CDPO నీలిమ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యాశాఖ, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ద్వారా నిర్వహించిన శిక్షణ తరగతులు నేటితో ముగిశాయని తెలిపారు. శిక్షణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధిత సర్టిఫికెట్ల అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌లను అందజేసినట్లు పేర్కొన్నారు.