VSP: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ వద్ద గత 39 ఏళ్లుగా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా వైభవంగా జరగనుంది. సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం జరపనున్నట్లు టీఎస్సార్ తెలిపారు. మంగళవారం విశాఖలోని ఆయన మీడియాతో మాట్లాడారు.