VSP: ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరెడ్ల విజయ గౌరి కోరారు. మంగళవారం విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శాసనమండలి అంటే పెద్దల సభ అన్నారు. పీడీఎఫ్ తరఫున తనను గెలిపిస్తే రాజకీయాలకు అతీతంగా పనిస్తానన్నారు.