AP: అందరూ గర్వపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని అసెంబ్లీ వేదికగా CM చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడి దానిని కూడా వైసీపీ నేతలు సమర్థించుకున్నారని ఆరోపించారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఏడాది జూన్‌లోగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లు కట్టి పేద ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.