SKLM: ఎచ్చెర్ల మండలం పోలీస్ క్వార్టర్స్ ZPHS స్కూల్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డా విశ్వక్సేన్ మంగళవారం సందర్శించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.