ASR: డుంబ్రిగుడ మండల కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన కొంతమంది విద్యార్థినులకు మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.కృష్ణకుమారి విద్య సామాగ్రిని మంగళవారం ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మంచిగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.