NLR: జిల్లాకు 19వ విడత ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రూ.33.52 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1.68 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ నిధులు రైతుల ఖాతాలకు నేరుగా జమవుతాయని తెలిపారు. రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నగదు జమవుతుందన్నారు.