W.G: మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీలను పార్టీ అధిష్టానం ప్రకటించింది. పబ్లిసిటీ, డెకరేషన్స్, సోషల్ మీడియా విభాగాల కమిటీలలో పాలకొల్లుకు చెందిన జనసేన రాష్ట్ర ప్రచార విభాగం ఛైర్మన్ గవర ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాసు) ను నియమించింది. ఈ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆవిర్భావ సభ ఏర్పాట్లు జరగనున్నాయి.