GNTR: ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో PDF లక్ష్మణరావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు అందిందని, దానిని ఎస్పీకి పంపామని మంగళవారం ఆమె మీడియాకు తెలిపారు.