AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీ రిమాండ్ పొడిగించారు. రిమాండ్ గడువు ముగియడంతో వంశీని జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే ఆయన్ను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంశీని కస్టడీకి తీసుకొనేందుకు పటమట పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు.