PLD: నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో నిర్మించిన విద్యుత్ ప్రభకు సోమవారం శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహాశివరాత్రి సందర్భంగా గ్రామం నుంచి కోటప్పకొండకు విజయవంతంగా విద్యుత్ ప్రభను తరలించడం జరుగుతుందన్నారు. సాంప్రదాయాలను కొనసాగిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.