ATP: రాయదుర్గం పట్టణం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రజాపిత బ్రహ్మకుమారి యోగేశ్వరి మాత ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 50 అడుగుల వాయు శివలింగం అందరినీ ఆకట్టుకుంది. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి శివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.