ELR: ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెదవేగి మండలం దుగ్గిరాలలో అవగాహన సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇంఛార్జ్‌లకు ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.