ATP: జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే పరిటాల సునీత కలిశారు. ఈ సందర్భంగా హంద్రీ-నీవా పరిధిలో భూగర్భ జలాలు అడుగంటకుండా చెరువులకు నీరు అందించాలని కోరారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. తన వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.