TG: మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్ రెడ్డి తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారు. రేవంత్ ప్రసంగంలో ఓటమి భయం కనిపిస్తోంది. మేం ఎవరితో కుమ్మక్కయ్యామో చెప్పాలి. యువతకు సీఎం ద్రోహం చేశారు. మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.