అన్నమయ్య: మదనపల్లెలోని యోగ భోగేశ్వర స్వామి దేవస్థానానికి సోమవారం భక్తుడు గార్ల చంద్రమౌళి కుటుంబసభ్యులతో కలిసి వెండి వస్తువులను బహుకరించారు. ఆలయ ఈవో రమణ, ప్రధాన అర్చకులు టి, విశ్వేశ్వర ప్రసాద్‌లు మాట్లాడుతూ.. స్వామివారి కైంకర్యాలకు ఈ వస్తువులు ఉపయోగించడం జరుగుతుందన్నారు. అనంతరం వారికి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.