ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వార్తల్లో నిలిచిన ‘శీష్ మహల్’లోకి త్వరలోనే రిపోర్టర్లను తీసుకెళ్తామని బీజేపీ తెలిపింది. సీఎంగా ఉన్న సమయంలో ఈ భవనాన్ని మాజీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంగా వినియోగించారని తెలిపింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దీన్ని విస్తరించారని ఆరోపిస్తూ.. ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా పేర్కొంది.