SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న మన ఊరు ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ లిమిటెడ్ వారు బోర్డు సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విత్తనాలు లైసెన్సులు, ఎరువుల లైసెన్సులు మరియు ముందస్తు పంటల ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశంలో బోర్డు మెంబర్స్ బొడ్డేపల్లి రామకృష్ణ, సనపల రంగారావు, రమాదేవి, మెట్ట మహేశ్వరరావు, సన్యాసిరావు, వీరవసంతరావు పాల్గొన్నారు.