VZM: ఈనెల 26న జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు ఎస్.కోట సమీపంలోని శైవక్షేత్రమైన పుణ్యగిరికి రానున్న భక్తులకు సర్పంచ్ సంతోషి కుమారి సోమవారం ఈవో అనురాధతో కలసి ఏర్పాట్ల నిర్వహణను ముమ్మరం చేశారు. ఈ మేరకు పుణ్యగిరికి వెళ్లే రహదారిలో మరుగుదొడ్లు, మంచినీరు తదితర ఏర్పాట్లను సర్పంచ్ పర్యవేక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.