NLR: మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డులోని పురాతన దేవాలయమైన శ్రీ కామాక్షితాయి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని శివరాత్రికి ముస్తాబు చేస్తున్నారు. దేవాలయానికి సున్నంతో పాటు రంగులు వేసి అలంకరించారు. భక్తుల నీడ కోసం షామినాలు వేస్తున్నారు. శివరాత్రి రోజు ప్రత్యేక అభిషేకాలతో పాటు కళ్యాణం నిర్వహిస్తారు.